సీసీఎంబీ యొక్క ప్రధాన క్యాంపస్, హబ్సిగూడలో 1987 లో మొదటి స్వతంత్ర క్యాంపస్ గా స్థాపించబడింది. ఈ క్యాంపస్‌లో జీవవిజ్ఞానంలోని ప్రాధమిక ప్రశ్నలపై అన్వేషణాత్మక పరిశోధనలు జరుగున్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న పరిశోధకులు ఉపయోగించుకునే విధంగా, ఇక్కడ క్యాంపస్ లో అనేక కేంద్ర పరిశోధనా వసతులు అమరి ఉన్నాయి.
అత్తాపూర్ లోని ల్యాబొరేటరీ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ ఎండేంజర్డ్ స్పీషీస్ (LaCONES) 2000 లో సీసీఎంబీ యొక్క మొదటి అనుబంధ ప్రయోగశాలగా స్థాపించబడింది. LaCONES లోని శాస్త్రవేత్తలు పర్యావరణ శాస్త్రం మరియు వన్యప్రాణుల ప్రవర్తనపై అధ్యయనం చేస్తారు. అలాగే వన్యప్రాణుల సంరక్షణ కోసం ఆధునిక మాలిక్యులర్ బయాలజీ సాధనాలను అభివృద్ధి చేస్తారు. దేశంలోని వివిధ జంతుప్రదర్శనశాలల్లో చనిపోయిన జంతువుల నుండి జన్యు పదార్థాన్ని సేకరించి భద్రపరచడానికి నేషనల్ జెనెటిక్ రిసోర్స్ బ్యాంక్ సదుపాయం కూడా ఇక్కడ ఉంది.
ఉప్పల్‌లోని మెడికల్ బయోటెక్నాలజీ సముదాయం 2015 లో సీసీఎంబీ యొక్క రెండవ అనుబంధ ప్రయోగశాలగా స్థాపించబడింది. ఈ ప్రయోగశాల సీసీఎంబీ శాస్త్రవేత్తలు మరియు స్టార్టప్ కంపెనీలు నిర్వహించే సాంకేతిక అభివృద్ధి కార్యక్రమాలకు అంకితం చేయబడింది. ప్రస్తుతం ఈ సముదాయంలో లైఫ్ సైన్సెస్ రంగంలోని వివిధ విభాగాలలో పనిచేస్తున్న 20 కంటే ఎక్కువ స్టార్టప్‌లకు మద్దతు లభిస్తోంది. వీటిలో కామన్ రీసెర్చ్ అండ్ టెక్నాలజీ డెవలప్మెంట్ హబ్ (CRTDH), అటల్ ఇన్క్యూబేషన్ సెంటర్–సీసీఎంబీ (AIC–CCMB), మరియు మైటీ స్టార్టప్ హబ్ లు ఉన్నాయి. ఇదే సీసీఎంబీ యొక్క మాలిక్యులర్ మరియు క్రోమోసోమల్ డయాగ్నస్టిక్ సదుపాయాలు ఉన్న ప్రదేశం కూడా. అదేవిధంగా, సీసీఎంబీ నిర్వహించే నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలకు ఈ సముదాయం వేదికగా కూడా పనిచేస్తుంది.
This will close in 0 seconds